ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం

By

Published : Mar 7, 2021, 7:51 PM IST

పురపాలక ఎన్నికల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలంటూ కళాజాతా బృందం అవగాహన కార్యక్రమం చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కోటదుర్గ దుర్గ గుడి వద్ద ప్రారంభించి.. ముఖ్య కూడళ్లలో నిర్వహించారు.

awareness program on vote
కళాజాత బృందం అవగాహనా కార్యక్రమం

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటు హక్కు వినియోగంపై ప్రజలను అధికారులు చైతన్యపరుస్తున్నారు. ఇప్పటికే ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్స్​ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల సభ్యులతో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కళాజాతా బృందం ప్రదర్శనలు ఇచ్చింది.

ఓటు హక్కు వినియోగంపై కళాజాతా బృందం అవగాహన కార్యక్రమం

పాలకొండ నగర పంచాయతీలో ఓటర్లు నిస్వార్థంగా తమ హక్కును వినియోగించుకోవాలని కళాజాతా బృందం సభ్యులు అన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు సెల్ ఫోను తీసుకొని వెళ్లకూడదని చెప్పారు. ఓటరు స్లిప్​తో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సూచించారు. కొవిడ్​ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. పట్టణంలోని కోటదుర్గ గుడి వద్ద కార్యక్రమం మొదలుపెట్టి.. వార్డుల్లోని ప్రధాన కూడళ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర పంచాయతీ కమిషనర్ నడిపేన రామారావు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

ABOUT THE AUTHOR

...view details