గుంటూరులో సాల్వేషన్ ఆర్మీ ఆర్గనైజింగ్ సంస్థ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు మాస్క్ లు, శానిటేజర్లు, గ్లౌజ్ లు పంపణీ చేశారు.
కరోన కట్టడిలో భాగంగా అమలు చేసిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరూ రహదార్లపైకి రావద్దని... అలా ఎవరైనా వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో పి.హెచ్.సి సెంటర్లను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు గురించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఎవరూ సెలవు పెట్టొద్దని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కడప జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ప్రతి వీధి తిరుగుతూ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. వీధుల్లో రసాయనాలను తానే స్వయంగా పిచికారి చేశారు. అనంతరాజుపేట వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు.