ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివారణకు జిల్లా అధికారుల అప్రమత్తం - కరోనాపై అవగాహన కార్యక్రమాలు

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పాలకొండ పట్టణంలో హైపోక్లోరైడ్ పిచికారి చేయించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యేలా పోలీసులు చర్యలు చేపట్టారు.

awareness on corona at srikakulam
శ్రీకాకుళంలో కరోనాపై అవగాహన

By

Published : Apr 11, 2020, 7:53 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఆర్డీవో టి.ఎస్​.కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం హైపో సోడియం ద్రావణం పిచికారి ప్రారంభించారు స్వయంగా ఆర్డీవో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పిచికారి చేయిస్తామన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ లాక్ డౌన్​ను పటిష్ఠంగా అమలుచేయాలన్నారు.

ఇచ్ఛాపురంలో

జిల్లాలోని ఇచ్ఛాపురంలో కరోనా వైరస్ ప్రైవేటు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వర్ణ భారతి విద్యాసంస్థల ఛైర్మన్ తులసీదాస్ రెడ్డి ఆధ్వర్యంలో తమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వంద మందికి పైగా ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు అందజేశారు.

ఇదీ చదవండి:'ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details