ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెరువు గర్భంలో అక్రమ కట్టడాల కూల్చివేత

By

Published : Jun 8, 2021, 7:32 PM IST

శ్రీకాకుళం జిల్లా పొనుగుటి వలస గ్రామంలోని రాంభట్ల చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని తహసీల్దార్ గోవిందరావు హెచ్చరించారు.

చెరువు గర్భంలో అక్రమ కట్టడాల కూల్చివేత
చెరువు గర్భంలో అక్రమ కట్టడాల కూల్చివేత


పొనుగుటివలసలోని.. రాంబట్ల చెరువులో అక్రమంగా నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. చెరువులో అక్రమ కట్టడాలు చేపడుతున్నట్లు.. తహసీల్దార్​కు ఫిర్యాదులు రావడంతో.. రెవెన్యూ అధికారులు, పోలీసులు.. జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు చేపట్టారు. రాంబట్ల చెరువు మొత్తం విస్తీర్ణం 15 ఎకరాల 47 సెంట్లు ఉండగా.. చాలా ప్రాంతం ఆక్రమణకు గురి అయ్యింది. చెరువు గర్భాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details