ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తిపై కత్తితో దాడి... నిందితుడి కోసం గాలింపు - srikakaulam-district crime news

తన భార్యతో ఫోన్​లో మాట్లాడుతున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి మరొకరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

attack-with-knife-in-tekkali
టెక్కలిలో వ్యక్తిపై కత్తితో దాడి

By

Published : May 2, 2021, 5:23 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధికి చెందిన దందాసి దుర్గారావు అనే వ్యక్తిపై అదే వీధికి చెందిన తోట వెంకీ కత్తితో దాడి చేశాడు. ఈఘటనలో బాధితుడికి తీవ్ర రక్తస్రావమైంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు దుర్గారావును టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తీసుకెళ్లారు. దుర్గారావు భార్య గీతపై కూడా వెంకీ కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యతో దుర్గారావు ఫోన్​లో మాట్లాడుతున్నాడన్న అనుమానంతో వెంకీ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details