శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి రామారావుపై ఆదివారం రాత్రి పలువురు దాడికి పాల్పడ్డారు. తాను ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు కత్తులు, కర్రలతో దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు.
ఈ దాడిలో రామారావుతో పాటు అతని భార్య రాధ గాయపడ్డారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా తరఫున అభ్యర్థిగా ఉన్న తనను పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నమని రామారావు ఆరోపించారు. దాడిలో గాయపడిన వీరిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.