తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు.. సభ నుంచి తనను సస్పెండ్ చేయడంపై సభాపతి తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. ప్రభుత్వ సమాధానానికి తాను సంతృప్తి చెందని కారణంగానే.. తన స్థానం నుంచే నిరసన తెలిపానని లేఖలో వివరించారు. తాను సీట్లో ఉన్నప్పటికీ తనను సస్పెండ్ చేయటం పట్ల ఆశ్చర్యానికి గురయ్యానన్న అచ్చెన్నాయుడు... ఎటువంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని లేఖలో స్పష్టం చేశారు. మార్షల్స్‌తో బయటకు పంపి తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యుడినైన తన హక్కులు హరించారని... అన్యాయంగా తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని సభాపతిని కోరారు.
''నాపై తీసుకున్న చర్యలను పరిశీలించండి'' - TDP MLA
తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని అచ్చెన్నాయుడు సభాపతిని కోరారు.
సభాపతికి తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు లేఖ