ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రస్తుతం పాఠశాలలు తెరవడం..విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమే - ప్రస్తుతం పాఠశాలలు తెరవడం..విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమే

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో యూటీఎఫ్ నాయకులు ఆందోళన చేశారు. క్వారంటైన్ కేంద్రాలకు ఇచ్చిన పాఠశాలలను ఇంతవరకూ శానిటైజ్ చేయలేదన్నారు. కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని ఆవేదన వ్యక్తం చేశారు.

at present reopening of schools may threaten for students lives
ప్రస్తుతం పాఠశాలలు తెరవడం..విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమే

By

Published : Jun 16, 2020, 6:31 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీ నగర్ పాఠశాల వద్ద యూటీఎఫ్ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సంఘ నాయకులు పేడాడ ప్రభాకర్ రావు మాట్లాడుతూ క్వారంటైన్​కు ఇచ్చిన పాఠశాలలను శానిటైజ్ చేయలేదన్నారు. పాఠశాలలకు శానిటైజర్లు, మాస్క్​లను పంపిణీ చేయలేదని తెలిపారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేసులున్నాయో అధికారులు విడుదల చేసిన లెక్కలు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలను తెరవడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. నాడు-నేడు పేరుతో ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ బాధ్యతారహిత్యమైన నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కుతీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ పి.ప్రభాకర్ రావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టీవీటీ భాస్కర్​రావు ,రావు తమ్మినేని పాపారావు, పి.అప్పలనాయుడు , బీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details