శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తోగరం పంచాయతీ పరిధిలోని నారిపేట, ఇసుకలపేట, దిబ్బలపేట గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణిశ్రీ పర్యటించారు. నారిపేట గ్రామానికి నాలుగు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, ఇసుకలపేట గ్రామానికి రూ.54 లక్షలు నగదుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, దిబ్బలపేట గ్రామానికి రూ.12 లక్షలతో సీసీ రహదార్ల నిర్మాణం త్వరలోనే చేపడతామని స్పీకర్ తెలిపారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన వాణిశ్రీని గ్రామస్థులు సన్మానించారు.
ఆమదాలవలసలో స్పీకర్ దంపతుల పర్యటన - srikakulam-district latest news
శ్రీకాకుళం జిల్లా తోగరం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
ఆమదాలవలసలో స్పీకర్ దంపతుల పర్యటన