శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ కొమ్మువలసలో సీసీ రోడ్డు నిర్మాణానికి శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికి, సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలోని అన్ని పల్లెలనూ అభివృద్ధి చేసేందుకు సీఎం చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు, అధికారులు పాల్గొన్నారు.