ప్రజా సమస్యలపై మాట్లాడొద్దని ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై... స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని... తానూ శాసన సభ్యుడినేనని పేర్కొన్నారు. అవసరమైతే... సభా నాయకుడి అనుమతితో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ఐదేళ్ల తెదేపా పాలనపై... 5 నెలల వైకాపా పాలనపై బహిరంగ చర్చకు రావాలని తమ్మినేని సవాల్ విసిరారు.
ప్రజా సమస్యలపై మాట్లాడొద్దంటే కుదరదు: తమ్మినేని - అధికారంపై తమ్మినేని సీతా రాం వ్యాఖ్యలు న్యూస్
ప్రజా సమస్యలపై మాట్లాడొద్దు అంటే కుదరదని... సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సమస్యలపై మాట్లాడకూడదని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో చెప్పాలని ప్రతిపక్ష నేతల్ని ప్రశ్నించారు.
![ప్రజా సమస్యలపై మాట్లాడొద్దంటే కుదరదు: తమ్మినేని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5065119-893-5065119-1573739683986.jpg)
assembly speaker tammineni comments on tdp