ఆశా వర్కర్లను సచివాలయాలకు అప్పగిస్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని.. ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న మండిపడ్డారు. ఆశావర్కర్లను సచివాలయాలకు అప్పగించడం వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ.. శ్రీకాకుళం కలెక్టరేట్‌ను ముట్టడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తరువాతే రిటైర్మెంట్ చేయాలని కోరారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని... ప్రతి నెలా రూ.10వేల వేతనం ఒకేసారి చెల్లించాలన్నారు. కరోనాతో మరణించిన ఆశాలకు రూ.50 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశావర్కర్లు - శ్రీకాకుళంలో ఆశా వర్కర్ల ధర్నా
ఆశాలను సచివాలయాలకు అప్పగించడం వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ... శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆశావర్కర్లను సచివాలయాలకు అప్పగిస్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు