ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెగ్యులరైజ్ చేయండి.. చట్ట పరమైన అన్ని సౌకర్యాలు కల్పించండి' - asha workers agitation news in kaviti

తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కవిటి మండలం కాపాసుకుద్ది గ్రామ సచివాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కొవిడ్​-19 విధుల్లో ఉన్న తమకు.... ఎన్​95 మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్​కి వ్యాక్సిన్ వచ్చేంతవరకు బీమా సౌకర్యాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

సచివాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా
సచివాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా

By

Published : Jun 25, 2020, 6:32 PM IST

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కాపాసుకుద్ది గ్రామంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కొవిడ్​-19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్లకు ఎన్​ 95 మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యేక కొవిడ్ అలవెన్స్​గా రూ.10 వేలు అందివ్వాలని కోరారు. తమను రెగ్యులరైజ్ చేసి చట్టపరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 ఆర్థిక సహాయం జనవరి నుంచి జూన్ నెల వరకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లను 2వ ఏఎన్ఎంగా గుర్తించాలని చెప్పారు. కొవిడ్​-19 వ్యాక్సిన్ వచ్చేంతవరకు బీమా సౌకర్యాన్ని పొడిగించాలన్నారు. మార్చి 15 తర్వాత మరణించిన ఆశా వర్కర్లకు బీమా మొత్తం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఆశా వర్కర్​గా అవకాశం కల్పించాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details