ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతకు బాసటగా...ఉపాధి జ్యోతి - mantri darmana

శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్ వేదికగా ఉపాధి జ్యోతి వెబ్‌సైట్​ను మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన ఈ వెబ్​సైట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

ఉపాధి జ్యోతి ఆవిష్కరణ

By

Published : Aug 23, 2019, 6:53 PM IST

ఉపాధి జ్యోతి ఆవిష్కరణ

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్​ వేదికగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధి జ్యోతి వెబ్‌సైట్‌ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతను వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార, ఉద్యోగ కల్పన కార్యాలయాలు, సంస్థలతో అనుసంధానించడం ఈ వెబ్​సైట్ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. జిల్లా యువతకు ఇది చక్కని అనుసంధాన వేదికగా ఉండటంతోపాటు ఉపాధి మార్గానికి బాటలు వేస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details