ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"యాజమాన్యానికి సిరి-కార్మికులకు ఉరి" - శ్రీకాకుళం జిల్లా

యాజమాన్యానికి సిరి-కార్మికులకు ఉరి" పేరుతో అరవిందో కార్మికులు వినుత్నంగా నిరసన తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల పైడిబీమవరంలో అరబిందో యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీ చేశారు.

ర్యాలీ చేస్తున్న అరవిందో కార్మికులు

By

Published : Aug 26, 2019, 11:52 AM IST

అరవిందో యాజమాన్యం కార్మికులను అన్యాయంగా తీసేసిందంటూ... నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పైడిబీమవరంలో ర్యాలీ చేశారు. అనంతరం మాట్లాడిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే సమ్మె తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అరబిందో యాజమాన్యం గత 16నెలలుగా చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కార్మికులను తొలగించడం అన్యాయమని అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అమ్మనాయుడు, అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గురునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ చేస్తున్న అరవిందో కార్మికులు

ABOUT THE AUTHOR

...view details