రథసప్తమి కోసం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబయింది. అర్ధరాత్రి నుంచి జరగనున్న ఈ వేడుకులకు పనులు చకచకా జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు క్షీరాభిషేకాన్ని నిర్వహించనున్నారు.
ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్ష సూర్య భగవానుడి నిజరూప దర్శనం కల్పిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ దృష్ట్యా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.