శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారు నేడు, రేపు బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమిస్తారు. 2008 రథసప్తమి తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆదిత్యుడ్ని వెండి నగలతోనే అలంకరిస్తున్నారు. కార్తిక ఏకాదశి, ద్వాదశి సందర్భంగా 12 ఏళ్లు తర్వాత మళ్లీ ఇప్పుడు వెలుగులరేడు ప్రత్యేక అలంకరణతో రెండు రోజులపాటు భక్తులకు దర్శనభాగ్యం ఇవ్వనున్నారు.
కిరీటం నుంచి పాదాల వరకు బంగారు ఆభరణాలు అలంకరిస్తామని సూర్య దేవాలయం ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. భద్రతా ప్రమాణాలు మెరుగుపరుచుకుని దేవాదాయశాఖ అనుమతులతో ప్రతి ఆదివారం బంగారు ఆభరణాలతో అలంకరిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.