సూర్య జయంతి సందర్భంగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ అరసవల్లి సూర్యదేవాలయంలో తొలి పూజ చేశారు. ఈ పూజలో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. తెదేపా నేత అచ్చెన్నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు స్వామి వారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరగుతోంది. అనంతరం సూర్యనారాయణ స్వామి వారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం ఇస్తారు. ఎస్పీ అమ్మిరెడ్డి నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు - arasavalli surya devalayam news
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలు మెుదలయ్యాయి. అర్ధరాత్రి నుంచే అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది.
arasavalli surya devalayam
Last Updated : Feb 1, 2020, 4:21 AM IST