తెలంగాణ రాష్ట్రం పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బొడ్డ పాపారావు భౌతిక కాయాం ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని బన్నువాడకు తీసుకొచ్చారు. అక్కడ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీ ఇంధన, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌కు ఎస్కార్ట్‌గా వెళ్తున్న సమయంలో టైరు పేలి వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అంత్యక్రియలకు జిల్లా అడిషనల్ ఎస్పీ సోమశేఖర్, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి హాజరై నివాళులర్పించారు. మృతుని భార్య పద్మకు ప్రభుత్వ సాయంగా రూ.లక్ష రూపాయలు చెక్కును అందజేశారు.
హైదరాబాద్‌లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి .. స్వగ్రామానికి మృతదేహం - AR head constable dead in accident news update
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బొడ్డ పాపారావు భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామమైన శ్రీకాకుళంలోని టెక్కలి సమీపంలో ఉన్న బన్నువాడకు తీసుకొచ్చారు. అక్కడ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
![హైదరాబాద్‌లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి .. స్వగ్రామానికి మృతదేహం ar-head-constable-dead-body-bring](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7944597-522-7944597-1594213749862.jpg)
హైదరాబాద్‌లో మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్