ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి పాలైన మత్స్యసంపద.. ఆందోళనలో గంగపుత్రులు

శ్రీకాకుళం జిల్లా డొంకూరులో కురుస్తున్న భారీ వర్షాలకు రూ.లక్షలు విలువచేసే మత్స్య సంపద నీటి పాలైందని గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు తీర ప్రాంతం పరిసరాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

By

Published : Oct 15, 2020, 10:25 PM IST

నీటి పాలైన మత్స్యసంపద.. ఆందోళనలో గంగపుత్రులు
నీటి పాలైన మత్స్యసంపద.. ఆందోళనలో గంగపుత్రులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రూ.లక్షలు విలువచేసే మత్స్య సంపద నీటి పాలైందని డొంకూరులో గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీర ప్రాంతం పరిసరాల్లో డొంకూరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

అక్టోబర్​లో చీకటి రాత్రులే..

ప్రతి ఏడాది అక్టోబర్ నెల వస్తే చాలు చీకటి రాత్రులు చూస్తున్నామని లబోదిబోమంటున్నారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని బెంబెలెత్తిపోతున్నామని పేర్కొన్నారు.

ఆరబెట్టిన మత్స్యసంపద..

గత పది రోజుల పాటు వేటాడి తెచ్చిన చేపలను సముద్ర తీరంలో ఎండబెట్టారు. ఇసుక తిన్నెలపై ఆరబెట్టిన మత్స్యసంపద ఇలా మట్టి పాలైందని ఉసూరుమంటున్నారు. ఇసుకతిన్నెలపై ఆరబెట్టిన చేపలు పూర్తిగా తడిచి మట్టిలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్స్య సంపదను కాపాడుకోవడానికి స్టోరేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి : అమరావతికి ఏం కాదు.. అవి తప్పుడు ప్రచారాలు: రైతులు

ABOUT THE AUTHOR

...view details