ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బందరు పోర్టుపై తెలంగాణ సీఎం కన్ను! - star campainar

ప్రమాదాలు జరుగుతాయని వాహన తాళాలు చిన్న పిల్లలకి ఇవ్వడానికి భయపడతాం... అలాంటిది 31 కేసులున్న వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర తాళాలు ఇస్తామా?- హరిపురం రోడ్​షోలో లోకేశ్

హరిపురం రోడ్​షోలో లోకేశ్

By

Published : Mar 26, 2019, 2:20 PM IST

హరిపురంలో లోకేశ్ రోడ్​షో
రాష్ట్రంలోని బందరుపోర్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కన్ను పడిందని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ పోర్టులో తెలంగాణ వాసులకు ఉద్యోగం కల్పించాలని చూస్తున్నారన్నాని ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో ఎంపీ రామ్మెహన్ నాయుడుతో కలిసిరోడ్​షోలో పాల్గొన్న లోకేశ్... కేసీఆర్​, ప్రతిపక్ష నేతజగన్​పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో బలహీన ముఖ్యమంత్రి వస్తే పోలవరాన్ని ఆపాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు.

25 స్థానాల్లో గెలిపించండి.. ప్రధాని ఎవరోబాబే నిర్ణయిస్తారు

'చిన్నపిల్లలకు వాహన తాళాలు కూడా ఇవ్వం... అలాంటిది 31 కేసులన్న వ్యక్తికి ఆంధ్రా రాష్ట్రాన్ని అప్పగిస్తామా' అని ప్రశ్నించారు. ప్రజల తీర్పుపైనేరాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు.25 పార్లమెంట్ స్థానాల్లో తెదేపా గెలిస్తే.. ప్రధాని ఎవరనేది చంద్రబాబు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తర్వాత మందస మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమైన తనకు.. ముందుగా స్ఫురించిందిమందాస ప్రాంతమే.... అని లోకేష్ చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details