AP Minister Seediri Appalaraju fire on Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలు ఇవ్వాలే తప్ప.. అడుక్కుంటే రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర మంత్రులు విమర్శల దాడికి దిగారు. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ కళా వేదిక వద్ద ఓ కార్యక్రమానికి హజరైన మంత్రి సీదిరి.. పవన్ కల్యాణ్‌పై, వారాహి యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి తామేందుకు భయపడాలని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ యాత్ర చేస్తున్నది ఎమ్మెల్యేగా గెలవడానికా..? లేక ఎమ్మెల్యేలను గెలిపించడానికా..? అన్నది ఆయనకే స్పష్టత ఉండాలని మంత్రి హితవు పలికారు. 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తెర వెనుక కలిసే ఉన్నారనీ.. జనం ముందు నాటకాలు ఆడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
''మొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నన్ను ఎవడు ఆపేది అసెంబ్లీకి వెళ్లడానికి..ఈసారి ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలిచి తీరుతానన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలవాలంటే ముందు ఆయనది ఏ నియోజకవర్గమో డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకోకుండానే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఎట్లా ప్రజలు గెలిపిస్తారు. తాజాగా చెప్పులు గురించి పవన్ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. చెప్పులు మార్చిపోతే తెచ్చుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. కానీ పార్టీ గుర్తే పోతే ఎలా..ముందు దాని గురించి ఆలోచించండి.-'' సీదిరి రాజు, పశు సంవర్థక శాఖ మంత్రి