రాష్ట్ర అవతరణ దినోత్సం సందర్భంగా సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో పాటు జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి ధర్మాన మాట్లాడారు.
అమరజీవి పొట్టిశ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి జగన్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.