ప్రముఖ ఆగమశాస్త్ర పండితులు, తితిదే విశ్రాంత ఆగమ సలహాదారు, దేవాదాయ శాఖ ఉత్తరాంధ్ర ఆగమ సలహాదారు చామర్తి జగ్గప్పలాచార్యులు (63) కరోనా వైరస్‌తో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన కొవిడ్ బారినపడి విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈరోజు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. యజ్ఞయాగాదులు నిర్వహించడంలో మంచి గుర్తింపు పొందారు. జగ్గప్పలాచార్యులు స్వగ్రామం నరసన్నపేట మండలం బాల సీమ గ్రామం.
తితిదే విశ్రాంత ఆగమ సలహాదారు చామర్తి జగ్గప్పలాచార్యులు కరోనాతో మృతి - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
తితిదే విశ్రాంత ఆగమ సలహాదారు, దేవాదాయ శాఖ ఉత్తరాంధ్ర ఆగమ సలహాదారు చామర్తి జగ్గప్పలాచార్యులు (63) కరోనా వైరస్ సోకడంతో మృతి చెందారు.
death