ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలి' - ap seeds managing director latest news srikakulam

ఖరీఫ్​లో రాష్ట్రవ్యాప్తంగా 8.2 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు రాయితీపై అందిస్తున్నట్టు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.శేఖర్​బాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మడపాంలో ఆయన.. రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

ap seeds devlopment company managing director conduct meeting
రైతులతో మాట్లాడుతున్నరాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.శేఖర్ బాబు

By

Published : Jun 10, 2020, 10:05 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జి. శేఖర్ బాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు 95 శాతం వరకు వరి విత్తనాలు అందించినట్లు తెలిపారు. అలాగే రాయలసీమ అన్నదాతలకు నాలుగు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రాయితీపై అందించామని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు వద్దకే విత్తనాలు చేరవేశామని... రైతు భరోసా కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని శేఖర్​ బాబు చెప్పారు. ఈ క్రాప్​లో రైతులు పండించే పంటల వివరాలు నమోదు చేసుకోవాలని తద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ రాబర్ట్ పాల్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సంపత్, వ్యవసాయధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details