రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం, ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణ దాస్, మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నగరం పాత బస్టాండ్ కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు.
లెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని ఉప ముఖ్యమంత్రి ధర్మాన అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.