రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో పీఆర్సీ ప్రకటిస్తుందనే ఆశతో ఉద్యోగులంతా ఉన్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయనకు సంఘ నేతలు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. 55శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీనిచ్చారు.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల ద్వారా ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు.. మళ్లీ పరీక్షలు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. బేషరతుగా రెగ్యూలరైజ్ చేయాలని కోరారు.
55 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించండి: ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ - ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు మళ్లీ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించటం సరికాదన్నారు.
AP NGO new president bandi srinivasa rao