శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారుల తీరుపై... స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ నుంచి శనివారం నరసన్నపేటకు చేరుకున్న 414 మంది మత్స్యకారులను.. 4 పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరందరికీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు క్లారెట్ స్కూలు, తామరాపల్లి సమీపంలోని మహిళా జూనియర్ గురుకుల కళాశాలల్లో పునరావాసం కల్పించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పునరావాస కేంద్రాల్లో ఉన్న వందలాదిమంది వలస కార్మికులు నరసన్నపేట వీధుల్లో సంచరించారు. అది చూసి.. అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డిగ్రీ కళాశాల భవనం పైకప్పుపై విన్యాసాలు చేస్తుండడం వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు.
అయితే... అధికారుల ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వారందరూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు పెరుగుతున్నాయి. వీరందరూ తరచూ భోజన తదితర సదుపాయాలపై నిలదీస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నరసన్నపేట నడిబొడ్డున గుజరాత్ నుంచి వచ్చిన వలస కార్మికులకు ఎలా పునరావాసం కల్పించారని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
41 మంది తరలింపు..