BOPPARAJU : ఓపీఎస్ విధానం ఒక్కదానికి మాత్రమే చర్చలకు వస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఏర్పాటు చేసిన.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంక్షేమ సంస్థ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల జనరల్ బాడీ మీటింగ్‌తో పాటు కమిటీల ప్రమాణస్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిన సంగతిని గుర్తు చేశారు. మూడు ఏళ్ల నుంచి ఎంతో ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను నీరుగార్చొద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు. సచివాలయాల ఉద్యోగుల బదీలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఓపీఎస్ విధానంపై మాత్రమే చర్చలకు వస్తాం: బొప్పరాజు - cps issue
BOPPARAJU ON CPS : ఓపీఎస్ విధానానికి మాత్రమే చర్చలకు వస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంక్షేమ సంస్థ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో మూడు రాష్ట్రాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు.
BOPPARAJU ON CPS