లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన హోటల్ రంగాన్ని అదుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీవీ రమణ కోరారు. శ్రీకాకుళం హోటల్ గ్రాండ్‌లో అసోసియేషన్ సభ్యులు సమావేశమై సమస్యలపై చర్చించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పన్నులు, విద్యుత్తు చార్జీల్లో రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోటల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు చేయాతనివ్వాలని కోరారు.
'హోటల్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' - హోటల్స్ పై కరోనా ప్రభావం
లాక్‌డౌన్‌తో నష్టాల్లో కూరుకుపోయిన హోటల్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పన్నులు, విద్యుత్తు చార్జీల్లో రాయితీలు ఇవ్వాలని కోరింది.
ఏపీ హోటల్స్ అసోసియేషన్ సమావేశం