ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ నిర్వహణలో రాష్ట్రానికి అవార్డుల పంట - దిల్లీలో ఉపాధి హామీ అవార్డుల ప్రదానం

ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకు రాష్ట్రానికి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. దిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా... రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ అవార్డులు అందుకున్నారు.

Ap got 4 awards in Nrega implementation
దిల్లీలో ఉపాధి హామీ అవార్డుల ప్రదానోత్సవం

By

Published : Dec 19, 2019, 7:46 PM IST

Updated : Dec 19, 2019, 9:07 PM IST

ఉపాధి హామీ నిర్వహణలో రాష్ట్రానికి అవార్డుల పంట

ఉపాధి హామీ పథకం అమలుపై జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని దిల్లీలో నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అవార్డులు అందజేశారు. ఉపాధి హామీ పథకం అమలు, పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థ స్వపరిపాలనలో... అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. 4 పురస్కారాలు దక్కించుకుంది. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన శ్రీకాకుళం జిల్లా అవార్డును అందుకుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది... కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు పొందారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రానికి మొత్తం 8 ఎనిమిది అవార్డులు వచ్చాయని ద్వివేది తెలిపారు.

Last Updated : Dec 19, 2019, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details