ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేశ ఆహార భద్రత కోసం ఉద్యమిస్తూనే ఉంటాం' - srikakulam latest news

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించింది. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దేశ ఆహార భద్రత, స్వావలంబనను కాపాడటానికి పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు.

ap farmers association rally in srikakulam palakonda mandal
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతిజ్ఞ ర్యాలీ

By

Published : Jan 1, 2021, 7:22 PM IST

అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించింది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతులకు పోకుండా ఉండేందుకు.. దేశ ఆహార భద్రత స్వావలంబనను కాపాడటానికి పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు.

ABOUT THE AUTHOR

...view details