ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Crime News: వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు - శ్రీకాకుళం జిల్లా వార్తలు

AP crime news: రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. మరో జిల్లాలో బ్యూటీషియన్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న మహిళను, తప్పుడు ప్రొఫైల్ సృష్టించి యువతులను మోసం చేస్తున్న కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు.

ap crime news
ap crime news

By

Published : Feb 18, 2022, 9:18 AM IST

Updated : Feb 18, 2022, 12:42 PM IST

రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం.. తల్లి, కుమారుడు మృతి

శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలం బుడితితో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కల్వర్టును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడుకు చెందిన కలగ రమణమ్మ(38), మణికంఠ(19)గా గుర్తించారు.

బ్యూటీషియన్ ముసుగులో గంజాయి విక్రయం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న హలీమున్నిసా బేగంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ..

కృష్ణజిల్లా గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ఇంట్లో చోరీ జరిగింది. ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో తన నివాసంలో రూ.3 లక్షల నగదు, బంగారం కాజేశారని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

ఆటో బోల్తా..10 మందికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం 16వ నంబరు జాతీయ రహదారిపై టైరు పేలి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

ఫేక్ ప్రొఫైల్​తో మోసాలు

తప్పుడు ప్రొఫైల్ సృష్టించి అమాయక యువతులను మోసం చేస్తున్న కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.50 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడేళ్లలో దాదాపు 100 మంది అమ్మాయి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలిందన్నారు.

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య...

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కుక్కలవానిపేటలో విషాదం నెలకొంది. ఆర్థిక సమస్యలతో కేశవ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతి తట్టుకోలేక గొంతు కోసుకుని భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.

రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు.

ఇదీ చదవండి :

CRIME: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Last Updated : Feb 18, 2022, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details