Another bear wandering in Srikakulam District: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల ప్రజలకు ఎలుగుబంట్ల భయం ఇంకా వదల్లేదు. మండలంలోని కిడిసింగి వద్ద మంగళవారం ఒక ఎలుగుబంటిని అటవీ అధికారులు పట్టుకోగా.. ఇవాళ తాడివాడ వద్ద మరో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఎలుగుబంట్ల సంచారం, దాడుల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మరో ఎలుగుబంటి సంచారం.. - bear wandering in Vajrapukotturu
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం తాడివాడ వద్ద ఇవాళ మరో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు.
Another bear wandering in srikakulam
తాడివాడలోని కాళీమాత గుడి నుంచి గుల్లపాడు చెరువు గట్టుకు వెళ్తున్న స్థానికులు ఎలుగుబంటిని చూసి భయ కంపితులయ్యారు. వెంటనే అధికారులు స్పందించాలని దాన్ని పట్టుకొని తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కిడిసింగి వద్ద రెండురోజు క్రితం ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంలో ఒకరు చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే.
ఇదీ చదవండి: కల్యాణదుర్గం కొండల్లో ఎలుగుబంట్ల సంచారం..