ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్‌వాడీల్లో ఐఏఎస్‌ బిడ్డలు

రోజువారి కూలీ అయినా తన బిడ్డను గొప్ప పేరున్న పాఠశాలలో చదివించాలని కోరుకుంటారు. అందుకు ఎంత శ్రమైనా పడతారు. అలాంటిది ఉన్నతోద్యోగులైతే ఇంకేముంది అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి భిన్నంగా సివిల్​ సర్వీస్ ఉద్యోగులు తమ పిల్లలను అంగన్వాడీకి పంపించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

By

Published : Feb 9, 2019, 8:33 AM IST

Updated : Feb 9, 2019, 10:51 AM IST

అంగన్​వాడీలో ఐఏఎస్​ పిల్లలు

అంగన్​వాడీలో ఐఏఎస్​ పిల్లలు వాళ్లవి ఐఏఎస్ పదవులు...పేరు ప్రఖ్యాతలున్న ఉద్యోగాలు చేస్తున్న వీరు తమ పిల్లలను పెద్ద పెద్ద విద్యాలయాల్లో చదివించుకోవచ్చు. సకల సౌకర్యాలు ఉన్న పాఠశాలలో చేర్పించవచ్చు. కానీ అన్నింటిని పక్కన పెట్టి ఓ ఇద్దరు ప్రభుత్వాధికారులు తమ సంతానానికి అంగన్‌వాడీ కేంద్రంలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి(వీవో)గా పనిచేస్తున్న శివశంకర్ తన రెండో కుమారుడు సోహన్ నందన్​ను మండల కేంద్రంలోని అంగన్వాడీలో చేర్పించారు. ఇంటికి 1.5 కిలోమీటర్ల​ దూరంలో ఉండే ఈ కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతున్నారు. రోజంతా ఇక్కడే గడిపే నందన్... చిన్నారులతో ఆడుతూ,పాడుతూ సరదాగా ఉంటాడు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవో అధికారి లక్ష్మీశ తన కుమార్తె ఆద్విని అంగన్​వాడీ కేంద్రంలో చదివిస్తున్నారు. ఓసారి ఈ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన లక్ష్మీశ... అక్కడి సదుపాయాలు నచ్చి... కుమార్తెను చేర్పించారు. పటిష్ఠ చర్యలతో ఈ కేంద్రాల్లో పోషకాహారం అందుతోందని... ఆట పాటలతో చక్కని వాతావరణంలో విద్య లభిస్తుందని లక్ష్మి అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల అధికారుల పిల్లలు అంగన్ వాడీల్లో చదవడం చూసి గ్రామస్థుల వారి పిల్లలను ఈ కేంద్రానికి పంపిస్తున్నారు.

అంగన్​వాడీలో ఐఏఎస్​ పిల్లలు
Last Updated : Feb 9, 2019, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details