Rain Alert: అల్పపీడన ప్రభావం.. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు! - IMD latest updates
![Rain Alert: అల్పపీడన ప్రభావం.. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు! heavy rain for next two days](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13036702-791-13036702-1631370102885.jpg)
19:36 September 11
ap to receive heavy rain for next two days
తూర్పుమధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా - బంగాల్ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు మూడ్రోజులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇదీ చదవండి
SAI DHARAM TEJ VIDEO CLIP: రేపు సాయిధరమ్ తేజ్‌కు శస్త్ర చికిత్స!