శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను బుల్లితెర యాంకర్ సుమ కనకాల సందర్శించారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంతో పాటు శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథస్వామిని కూడా దర్శించుకున్నారు. దేవాలయాల్లోని అర్చక బృందం వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. సూర్యనారాయణస్వామి వారి చిత్రపటాన్ని ఆలయ ఈవో హరి సూర్య ప్రకాష్ అందజేశారు. ఆలయాల విశిష్టతను యాంకర్ సుమ అడిగి తెలుసుకున్నారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న యాంకర్ సుమ - శ్రీకాకుళం తాజా వార్తలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని బుల్లితెర యాంకర్ సుమ కనకాల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సూర్యనారాయణ స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
స్వామివారి చిత్రపటాన్ని అందుకుంటున్న యాంకర్ సుమ