శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బైదలాపురం గ్రామ సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై ఉన్న పురాతన వంతెన శుక్రవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 1974లో నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. తరచూ గ్రానైట్ రాళ్లతో భారీ వాహనాలు రాకపోకలు చేయడమే కూలడానికి కారణమని ఆరోంచారు. వంతెన కూలిన కారణంగా.. బైదలాపురం గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, 29న సర్పంచి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులకు, అటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వంశధార అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నారు.
వంశధార నదిపై కూలిన పురాతన వంతెన - శ్రీకాకుళం జిల్లాలో వంతెన కూలిపోయింది
శ్రీకాకుళం జిల్లాలో 1974 లో నిర్మించిన పురాతన వంతెన కూలిపోయింది. బైదలాపురం గ్రామానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
వంశధార నదిపై కూలిన పురాతన వంతెన