శ్రీకాకుళం జిల్లాలో అంపన్ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచి జిల్లా అంతటా దట్టమైన మేఘాలు అలముకున్నాయి. అక్కడక్కడ చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పలాస మండలాల్లో సముద్రం ముందుకు వచ్చింది.
శ్రీకాకుళం జిల్లాపై అంపన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో అంపన్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. సైక్లోన్ ప్రభావంతో సముద్రం ముందుకువచ్చి భూమి కోతకు గురవుతోంది. అప్రమత్తమైన అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాపై అంపన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు
100 మీటర్లు ముందుకు రావటంతో.. అలల తాకిడికి ఇసుక దిబ్బలు కోతకు గురవుతున్నాయి. చేపలవేట సామగ్రిని సమీప తోటల్లో భద్రపరుచుకునే పనిలో మత్య్సకారులు నిమగ్నమయ్యారు. వంశధార గొట్టాబ్యారేజీ నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ నివాస్.. కోసి ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించారు.
ఇవీ చదవండి... కమ్ముకుంటున్న మేఘాలు.. ఎగసిపడుతున్న అలలు