Americans visited Pochampally: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని చేనేత కళాకారుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత భోగ బాలయ్య ఇంటిని అమెరికా దేశానికి చెందిన కిమారా జాఫ్రీ, గాబ్రియల్ సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులకు చేనేత విధానాన్ని భోగ బాలయ్య వివరించారు.
చేనేత వస్త్రాలను ఆసక్తిగా తిలకించిన అమెరికా వాసులు - ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
Americans visited Pochampally: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పోచంపల్లి పట్టుచీరలకు.. ఇతర వస్త్రాలకూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉన్నాయి. అందుకే హైదరాబాద్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు పొరుగునే ఉన్న పోచంపల్లి కూడా సందర్శనీయ స్థలమైంది. అదే తరహాలో అమెరికా వాసులు.. చేనేత కళాకారుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత భోగ బాలయ్య ఇంటిని సందర్శించి మగ్గం పనితీరును ఆసక్తిగా తిలకించారు.
పోచంపల్లి పట్టుచీరలు
10 వేల రంగులతో డబుల్ ఇక్కత్ హ్యాండ్లూమ్లో భారతదేశ పటం మధ్యలో రాట్నం వచ్చే విధంగా బాలయ్య తయారు చేసిన వస్త్రాలను అమెరికా దేశస్తులు ఆసక్తిగా తిలకించారు. భోగ బాలయ్య 124 రంగులతో మగ్గంతో నేసిన వస్త్రాలను పరిశీలించారు. వాటితో పాటు ఇతర వస్త్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మగ్గం పనితీరును వారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భోగ బాలయ్య దంపతులు వారిని సత్కరించారు.
ఇవీ చదవండి: