బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వేడుక చేశారు. ఆ మహనీయుని విగ్రహానికి డీసీసీబీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్ పూలమాలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ అంబేడ్కర్ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో టి.వి.ఎస్.జి కుమార్, తహసీల్దార్ రామారావు, కమిషనర్ పుష్పనాదంతో పాటు అధికారులు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు పాలకొండ అధికారుల నివాళి
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పాలకొండ సీతంపేట కూడలి వద్ద అధికారులు నివాళి అర్పించారు. ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేశారు.
నివాళులు అర్పిస్తున్న పాలకొండ అధికారులు