శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మహాత్మగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి వ్యఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీయులు మన సరిహద్దుల్లోకి రానట్లయితే మన జవాన్లు ఎలా మరణించారంటూ బొడ్డేపల్లి సత్యవతి ప్రశ్నించారు. దేశానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సమాధానం చెప్పాలన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఆమదాలవలసలో కాంగ్రెస్ నాయకులు నిరసన - ఆమదాలవలస కాంగ్రెస్ నాయకులు తాజా వార్తలు
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఆమదాలవలస పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేశారు.

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఆమదాలవలసలో నిరసన