కార్మిక, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త పిలుపు మేరకు సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలు శ్రీకాకుళంలో నిరసన చేశారు. లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలను చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ, ఆటో, రవాణా కార్మికుల కుటుంబాలకు నెలకు రూ. 10 వేలు చొప్పున మూడు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలి' - srikakulam town latest news
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ అన్ని వర్గాల కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. కార్మికులను లాక్డౌన్ సమయంలో తొలగించరాదని, పూర్తి వేతనాలు చెల్లించాలంటూ శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో వద్ద ఆందోళన చేశారు.
శ్రీకాకుళంలో కార్మిక సంఘాలు నిరసన