ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పొరుగు సేవల సిబ్బంది తొలగింపు దారుణం' - నరసన్నపేట తాజా వార్తలు

తామరాపల్లి ఏపీ రెసిడెన్షియల్​ మహిళా కళాశాల ప్రాంగణం వద్ద ఏఐసీటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న 2500 మంది పొరుగు సేవల సిబ్బందిని తొలగించడం దారుణమని ఆ సంఘ జిల్లా కన్వీనర్​ ఆవేదన చెందారు.

aictu protest at narasannapeta ap residential ladies college for firing contract employees
నరసన్నపేటలోని రెసిడెన్షియల్​ మహిళా కళాశాల ప్రాంగణం వద్ద ఏఐసీటూయూ రిలే నిరాహార దీక్ష

By

Published : Aug 20, 2020, 5:28 PM IST

నరసన్నపేట సమీపంలోని తామరాపల్లి ఏపీ రెసిడెన్షియల్​ మహిళా కళాశాల ప్రాంగణంలో ఏఐసీటీయూ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న సిబ్బందిని తొలగించడం అన్యాయమని ఆ సంఘం జిల్లా కన్వీనర్​ గణేష్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ పదవిలోకి రాకముందు ఓ మాటి చెప్పి... ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని​చెప్పి... ఇప్పుడు తొలగించడం దారణమని ఆగ్రహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన జోక్యం చేసుకుని... తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details