ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో  'ఖరీప్ కార్యచరణ ప్రణాళిక' సమావేశాలు

'ఖరీప్ కార్యచరణ ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 9 వ్యవసాయ శాఖ సబ్​డివిజన్​లోని 38 మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.  ఇవాల్టి నుంచి వచ్చే నెల 13 వరకు ఈ  గ్రామ సభలు జరగనున్నాయి.  రానున్న ఖరీఫ్ కాలంలో సాగు చేయాల్సిన రకాలు, భూసార పరీక్షలు వంటి తదితర అంశాలపై ఈ గ్రామ సభలో రైతులతో చర్చించనున్నారు.

'ఖరీప్ కార్యచరణ ప్రణాళిక'

By

Published : Apr 25, 2019, 7:53 AM IST

'ఖరీప్ కార్యచరణ ప్రణాళిక' సమావేశాలు

'ఖరీప్ కార్యచరణ ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 9 వ్యవసాయ శాఖ సబ్​డివిజన్​లోని 38 మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లిలో రైతు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి.సత్యవతి, బి. రజిని, వ్యవసాయ అధికారి మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు.
ఇవాల్టి నుంచి వచ్చే నెల 13 వరకు ఈ గ్రామ సభలు జరగనున్నాయి. రానున్న ఖరీఫ్ కాలంలో సాగు చేయాల్సిన రకాలు, భూసార పరీక్షలు, రుణాలు, ఎరువులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ తదితర పథకాలపై ఈ గ్రామ సభలో రైతులతో చర్చించారు. వీటితోపాటు, రైతులకు అవసరమైన యాంత్రీకరణ పనిముట్లు, రాయితీపై విత్తనాల సరఫరా తదితర అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.


20వేల 4వందల హెక్టార్ల వరి సాగు లక్ష్యం
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్​లో23వేల 8వందల191హెక్టార్లలో వివిధ పంటలు సాగు లక్ష్యం కాగా... 20వేల 4వందల 660 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం నిషేధించిన '1001' రకానికి, ప్రత్యామ్నాయంగా పలు కొత్త వరి వంగడాలను, ఈ సమావేశాల్లో... రైతులకు పరిచయం చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో గ్రామస్థాయిలో జరిగే ఖరీఫ్ సాగు ప్రణాళికలు పై అధికారులు దృష్టిసారించారు.

ABOUT THE AUTHOR

...view details