శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారి వద్ద వాహనాలకు పిచికారి చేసి ఆ తరువాతే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలను పైడిభీమవరం వద్ద హైపోక్లోరైడ్ ద్రావణంతో పూర్తిగా స్ప్రే చేస్తున్నారు. ఆ తరువాతే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. వాహనాల డ్రైవర్లను టన్నెల్ గుండా పంపి వైరస్ వ్యాప్తి జరగకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే తరువాతే వాహనాలకు అనుమతి - శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను పైడిభీమవరం వద్ద హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేసిన తరువాతే వాహనాలను జిల్లాలోకి అనుమతిస్తున్నారు.
after-spraying