సారా తాగి జీవితాలు నాశనం చేసుకోవద్దని శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కవిటి మండలం పెద్దకపాసకుద్ధిలో నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో సిబ్బందితో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించారు.
'సారాబారిన పడి జీవితాలు నాశనం చేసుకోకండి' - చట్టాలపై అవగాహన కల్పిస్తున్న అడిషనల్ ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్దకపాసకుద్దిలో నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి సోదాలు చేశారు. సారా బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించారు.
చట్టాలపై అవగాహన కల్పిస్తున్న శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ
యువకులు, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఒడిశా నుంచి సారా సరఫరాను అరికట్టకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం పట్టణ సీఐ వినోద్ బాబు, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ పోలీసులు శాఖ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: