ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జలుబు, దగ్గు, జ్వరం ఉంటే.. ఆశా వర్కర్లకు తెలియజేయండి' - srikakulam district latest news

పలాసలో జిల్లా అదనపు వైద్యశాఖాధికారి జగన్నాథరావు పర్యటించారు. కరోనా లక్షణాలతో ఎవరైనా కలిగి ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆశావర్కర్లను ఆదేశించారు.

additional dmho visit palasa and given suggestions to asha workers and palasa people
పలాసలో పర్యటించిన జిల్లా అదనపు వైద్యశాఖాధికారి

By

Published : Jun 21, 2020, 7:23 AM IST

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో జిల్లా అదనపు వైద్యశాఖాధికారి జగన్నాథరావు పర్యటించారు. పలాస మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడితే... తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆశా వర్కర్లకు తెలిపారు.

జిల్లాలో పెరుగుతున్న కరోనా వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రజలంతా హోమ్ క్వారంటైన్​లో ఉండాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే... వెంటనే దగ్గరలోని ఆశా వర్కర్లకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details