శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో వివాహాది శుభకార్యాలపై.. ఎస్ఐ కోటేశ్వరరావు, ఉప తహసీల్దార్ రామకృష్ణ తమ సిబ్బందితో ఆరా తీశారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు జరుపుతున్న వారిపై జరిమానా విధించారు. మండలంలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు జరుపుకుంటున్న.. గేదెల హరిప్రసాద్‌కు రూ.10 వేలు, పిట్ట రమణకు రూ.20 వేలు, చేపన వెంకటేష్‌కు రూ.5 వేలు జరిమానా విధించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలకు వ్యతిరేకంగా శుభకార్యాలు నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి శుభకార్యాలు జరుపుకునే వారిపై చర్యలు - కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి శుభకార్యాలు జరుపుకుంటున్న వారిపై పోలీసులు జరిమానా విధించారు. కర్ఫ్యూ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైనా శుభకార్యాలు నిర్వహిస్తే.. వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
curfew