ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జ్ - తెదేపా నేత అచ్చెన్నాయుడు తాజా వార్తలు

మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు కరోనాను జయించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగెటివ్​గా ఫలితం వచ్చింది. వైద్యులు సోమవారం ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు.

Actchannaidu was discharged from the hospital
Actchannaidu was discharged from the hospital

By

Published : Aug 31, 2020, 4:49 PM IST

ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జ్

గుంటూరులోని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు డిశ్ఛార్జ్ అయ్యారు. ఈఎస్​ఐ కేసులో రిమాండ్​లో ఉన్న సమయంలో ఆయనకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఆయనకు మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్​గా తేలింది.

ఈ క్రమంలో ఆయన్ను వైద్యులు సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడకు అచ్చెన్నాయుడు వెళ్లారు. ఈఎస్​ఐ కేసులో అచ్చెన్నాయుడికు ఇటీవలే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్న ఆర్థిక లబ్ది పొందారనేందుకు అనిశా సాక్ష్యాలను సమర్పించనందుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details